తెలంగాణ వడ్ల రాజకీయం దుమారాన్ని రేపుతోంది. 13న రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ పంపుతామని, కేంద్రం తీసుకోవాలని కోరారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం బియ్యం తీసుకోవటం కోసం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ రాష్ట్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రప్రభుత్వం ఘర్షణాత్మకమయిన వైఖరితో, విమర్శలు చేసింది. రాష్ట్రం ఆలస్యం చెయ్యటం వల్ల రైతులు…