Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వడ్ల రాజకీయం దుమారాన్ని రేపుతోంది. 13న రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ పంపుతామని, కేంద్రం తీసుకోవాలని కోరారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం బియ్యం తీసుకోవటం కోసం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ రాష్ట్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రప్రభుత్వం ఘర్షణాత్మకమయిన వైఖరితో, విమర్శలు చేసింది.
రాష్ట్రం ఆలస్యం చెయ్యటం వల్ల రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవాల్సి వచ్చింది.తమ రాజకీయ స్వలాభమ్ కోసం, రైతుల జీవితాలతో చెలగాటం ఆడారు. ఉప్పుడు బియ్యం పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రం అంగీకారాన్ని తెలిపిందన్నారు. వడ్ల కొనుగోలు కోసం ఏ రకమయిన ఏర్పాట్లు చెయ్యలేదన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బాధ్యతారహితంగా రాష్ట్ర సర్కార్ వ్యవహరించింది.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
గత ఖరీఫ్, రబీ సీజన్ల బియ్యాన్ని ఇప్పటికి ఇవ్వలేదు. తెలంగాణలో 15 కోట్ల గోనె సంచులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కోటి సంచులు కూడా లేవు. కేసీఆర్, కేటీఆర్ లు తట్టల్లో బియ్యం మోస్తారా? హుజురాబాద్ లో బీజేపీ గెలిచాక రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. యుద్ధప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యాలి. నూకల నుంచి బయో ఫ్యుయల్ తయారు చేయొచ్చు.. అందుకోసం బయో ఫ్యూయల్ తయారీ కోసం బోర్డ్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
రైస్ మిల్స్ లో ఎంత బియ్యం నిల్వ ఉండాలో ఉండటం లేదు. తెలంగాణ లో అన్ని రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని అధికారులను అదేశించాం. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. 40 రైస్ మిల్స్ తనిఖీ చేస్తే 4,53,896 బస్తాల బియ్యం తక్కువ ఉంది. సీబీఐ దర్యాప్తు కోసం ఓ నాయకుడు లేఖ రాశారు. వాస్తవానికి రైస్ మిల్లులపై కేంద్రానికి అధికారం లేదు. ఇంతకూ ఆ బియ్యం ఏమయ్యాయో స్పష్టత కావాలన్నారు. రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం.
రైతుల విషయంలో కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఎన్నో రాష్ట్రాల్లో రైతులు మాకు మద్దతుగా ఉన్నారు. ప్రయివేట్ వాళ్ళు బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఆర్ధిక సాయం చెయ్యాలి. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఆర్ధిక సాయం చెయ్యాలి. జీహెచ్‌ఎంసీలో ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు ఇవ్వలేదు. రాష్ట్రాన్నీ రావణకాష్టం చేస్తున్నారు. రాజకీయం చేయాలనుకుంటే చాలా అంశాలున్నాయి. కమిషన్ల కోసం అప్పులు తీసుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి.
Read Also: Jagga Reddy: టీఆర్ఎస్, బీజేపీది మైండ్ గేమ్.. 12 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్‌కి గిఫ్ట్ ఇవ్వాలి..
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!