కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్' ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందించారు. కువైట్-భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.
ప్రధాని నరేంద్ర మోడీ కువైట్‌లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్‌లైన్‌లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు.