గుజరాత్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా చేసుకొని బీజేపీ ఎత్తులు వేస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పటేల్ వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆప్ కూడా తన మనుగడ చాటుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుజరాత్‌లో పారిశ్రామిక నగరమైన సూరత్‌లో ఆ పార్టీ బలంగా ఉన్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 20 వార్డులు గెలుచుకొని తన ఉనికిని చాటుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో…
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందనగా, హఠాత్తుగా ముఖ్యమంత్రి విజయ్ రూపానిని రాజీనామా చేయమని బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆదేశించడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. గతంలో, 2016 లో కూడా, 16 నెలలు ముందుగా ముఖ్యమంత్రి గా ఆనందిబెన్ పటేల్ ను రాజీనామా చేయాలని ఆదేశించింది అధికార బీజేపీ అగ్రనాయకత్వం. గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న, శక్తివంతమైన పటేల్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశమే బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుత నిర్ణయానికి ప్రధాన కారణం…
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈరోజు రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో పాటుగా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే తలంపుతో తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి అనగా పదవి నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన తప్పుకోవడానికి పటేల్ వర్గం వ్యతిరేఖతే కారణమని తెలుస్తోంది. గుజరాత్‌లో పటేల్ వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి ఓటు బ్యాంకింగ్ ఏ పార్టీకైనా సరే చాలా అవసరం. 2017లో…
ఉత్తర భారతదేశంలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చేనెలలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో జరగబోతున్న ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీపై ప్రియాంకను రంగంలోకి దించుతోంది బీజేపీ. లాయర్‌గా ఆమెకు కోల్‌కతాలో మంచిపేరు ఉన్నది. డేరింగ్ విమెన్‌గా ఆమెకు అక్కడ పేరు ఉన్నది. 2021 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు…
గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడి శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమే అని, ఆ శక్తులు ఉనికి శాశ్వతం కాదని అన్నారు. ఆ శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్టలేవని ప్రధాని తెలిపారు. సోమ్‌నాథ్ ఆలయం నవభారతానికి చిహ్నమని, గడిచిన వందల సంవత్సారాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారని,…
వందేళ్ల క్రీడా చరిత్రలో అథ్లెట్ విభాగంలో భారత్ తొలి స్వర్ణం గెలుచుకుంది. భారత్ స్వర్ణం గెలుచుకోవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నది. ప్రభుత్వాలు నీరజ్ చోప్రాకు విలువైన బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు నీరజ్ చోప్రాకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, నీరజ్ పేరు ఉన్న వారికి కొన్ని చోట్ల ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను ప్రకటించాయి. గుజరాత్‌లోని భరూచ్‌లోని ఒ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను ప్రకటించింది. సోమవారం సాయంత్రం 5…
ఇప్పుడు ప్రపంచం స్మార్ట్ దిశగా పరుగులు తీస్తున్నది. ఒకే చోట అన్ని రకాల వసతులు ఉండే విధంగా ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇక దేశంలో అనేక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసిందే. దేశంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ముందువరసలో ఉన్నది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో దేశంలోనే తొలి స్మార్ట్‌పోల్ ను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో మొత్తం ఇలాంటి పోల్ స్థంబాలు మొత్తం 19 ఏర్పాలు చేశారు. ఇందులో రెండు రకాల…
సెల్ఫీలు ఈ రోజుల్లో కామన్ అయింది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్పీల విప్లవం మొదలైంది. ఎక్కడ కావాలంటే అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. కొన్నిసార్లు ఈ సెల్ఫీలు ప్రమాదానికి కారణం అవుతుంటాయి. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో సెల్ఫీలపై నిషేదం విధించారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో గుజరాత్‌లోని సాత్పురా టూరిస్ట్ ప్రదేశానికి ఎక్కువ మంది పర్యటకులు వస్తుంటారు.…
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించగా.. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ పేరుతో కఠిన చర్యలకు పూనుకున్నాయి.. ఓ దేశలో రోజువారి కేసులు దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా నమోదు కాగా.. క్రమంగా తగ్గుతూ ఇప్పుడు లక్షకు చేరువయ్యాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.. ఇదే సమయంలో.. గుజరాత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.. దీంతో.. లాక్డౌన్ నుంచి క్రమంగా అన్‌లాక్‌కు వెళ్లోంది ఆ రాష్ట్రం.. ఇవాళ భారీగా సడలింపులు…