దీపావళి వస్తుంది అంటే పిల్లలు ఎంత సంతోషిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటారు. టపాసులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు. గుజరాత్‌లోని సూరత్‌లో నలుగురు చిన్నారులు చేసిన పని పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అయితే, అప్రమత్తం కావడంతో తృటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సూరత్‌లోని ఓ ఇంటి ముందు నలుగురు పిల్లలు టపాసులు తీసుకొని వచ్చి వాటిని మ్యాన్‌హోల్‌పై ఉంచారు. టపాసుల్లోని భాస్వరాన్ని కాగితంపై పోసి…
గుజరాత్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సూరత్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కులు తయారు చేసే పరిశ్రమలో ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమలో అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. Read:…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే, ఇంకా కొందరిలో అపోహలు ఉన్నాయి.. వారి అపోహలు వీడి వ్యాక్సిన్ కోసం అడుగులు వేసేలే.. పలు సంస్థలు రకరకాల స్కీమ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్‌లోని అమ్‌వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్తగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది… వ్యాక్సినేషన్‌కు, పండుగకు లింక్ చేసి.. మరీ ఆఫర్ ప్రకటించింది ఏఎంసీ.. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే లీటర్ వంట నూనె ప్యాకెట్ ఉచితంగా…
తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుఫాన్ గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళే ఈ తుఫాను ఏర్పడుతుందని ఐఎండీ అభిప్రాపయపడుతోంది. దీనికి ‘సైక్లోన్ షహీన్ అని పేరు పెట్టారు. ఈ పేరును కతార్ సూచించింది. ఈ తుఫాను భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించబోదని పరిశోధకులు చెప్తున్నారు. ఇది పాకిస్థాన్ వైపు వెళ్లనుందని వివరించారు. అయితే భారీ…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుఫాన్‌గా మారి సెప్టెంబర్ 30న పాకిస్థాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుఫాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్‌లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో…
ఢిల్లీ జీఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరియు గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.. ఆ ఇద్దరు నేతలు భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్‌ను కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు, కన్హయ్య కుమార్‌కు…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డ్రగ్స్ వ్యవహారంపై ఓ ట్వీట్ చేశారు. గుజరాత్‌లో తీగలాగితే ఏపీలో డొంక కదిలిందని, రూ.72 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డ్రగ్స్ డాన్ ఎవరు అంటూ అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేశారని నారా లోకేష్ ట్వీట్…
గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపణలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయ్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయ్. గుజరాత్ డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకుంది DRI. కేసులో ఇప్పటి వరకు 8 మందిని కటకటాల్లోకి నెట్టింది. వీరిలో నలుగురు అఫ్ఘాన్ దేశస్తులు, ముగ్గురు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నాడు. సుధాకర్ దంపతులతో పాటు మరో ఇద్దరిని చెన్నైలో పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. కాందహార్…
వచ్చే ఏడాది గుజరాత్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సాయించాయి. ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా మార్చేసింది బీజేపీ అధిష్టానం. అటు కాంగ్రెస్ కూడా ధీటుగా ప్రణాళికలు రచిస్తున్నది. ఆప్ సైతం తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కాగా, ఇప్పుడు మరోపార్టీ కూడా గుజరాత్ ఎన్నికలపై కన్నేసింది. అదే ఎంఐఎం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బలమైన పార్టీగా నిలిచిన ఎంఐఎం…
గుజరాత్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం భూపేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. కాగా రేపు భూపేంద్ర క్యాబినెట్ ప్రమాణ ప్రమాణస్వీకారం ఉండబోతున్నది. కాగా, ఈరోజు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపారు. స్పీకర్ రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్టు సెక్రటరి ప్రకటించారు. కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్నది…