Virat Kohli: బెంగళూరులో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు కోహ్లీ. 61 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి వరుసగా ఇది రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు విరాట్. IPLలో విరాట్ కోహ్లీకి ఇది ఏడో సెంచరీ. అంతేకాదు… IPL చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న…
IPL Playoffs 2023: ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. దీంతో 16వ సీజన్ విజేత ఎవరో ఈ వారాంతంలో తేలిపోనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఉత్కంఠభరిత పోరాటాల ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ముందుగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండో స్థానంలో నిలిచింది.…
ముగిసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసిన ఆర్సీబీ.. గుజరాత్ లక్ష్యం 198 పరుగులు.. మరో శతకం చేసిన విరాట్ కోహ్లీ.
టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ వచ్చారు. మొదటి ఓవర్ నుంచే ఈ ఇద్దరు బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అయితే వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది.