Virat Kohli: బెంగళూరులో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు కోహ్లీ. 61 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి వరుసగా ఇది రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు విరాట్. IPLలో విరాట్ కోహ్లీకి ఇది ఏడో సెంచరీ. అంతేకాదు… IPL చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న కోహ్లీ.. బెంగళూరు చినస్వామి స్డేడియంలో చేసిన సెంచరీతో అతన్ని దాటి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ప్రస్తుతం ఆరు సెంచరీలతో గేల్ 2 స్థానంలో ఉంటే.. ఐదు సెంచరీలతో జాస్ బట్లర్ మూడో స్థానంలో ఉన్నాడు. IPLలో ఒకే సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్, జాస్ బట్లర్ వరుసగా రెండు సెంచరీలు సాధించారు. మొదానంలో కోహ్లీ చెలరేగుతుంటే.. స్టేడియంలోని అభిమానులు హర్షద్వానాలతో అతన్ని ప్రోత్సహించారు. మరోవైపు.. విరాట్ సెంచరీ చేయగానే అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది.. మొత్తం మీద విరాట్ కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడు.
కానీ, ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ సారైనా టైటిల్‌ను గెలిచి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఆర్సీబీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్లేఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయాన్ని మూఠగట్టుకుంది.. 198 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే కోహ్లీ కన్నీరు పెట్టుకున్నాడు. ఆఖరిలో డగౌట్ కూర్చోని మ్యాచ్‌ను వీక్షించిన కోహ్లి.. తన జట్టు ఓడిపోవడంతో ఒక్కసారిగా భావద్వోగానికి గురయ్యాడు.