ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. అయితే వర్షం కారణంగా టాస్ వేయడం కాస్తా ఆలస్యం అయింది. ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గుజరాత్‌పై ఆర్‌సీబీ గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే. ప్రస్తుతం వర్షం నిలిచిపోవడంతో టాస్ వేయగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.
Also Read : MP Avinash Reddy: సీబీఐకి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ
టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ వచ్చారు. మొదటి ఓవర్ నుంచే ఈ ఇద్దరు బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు టీమ్ వికెట్ నష్టపోకుండ.. 62 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(28) ఔట్ అయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్ తెవాలియా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో 67 పరుగుల(7.1వ ఓవర్) వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది.
Also Read : Music Director Koti: మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారు..
ఇక రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్(11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 80 పరుగుల(8.2వ ఓవర్) వద్ద బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. 9 ఓవర్లకు బెంగళూరు టీమ్ రెండు వికెట్లు నష్టపోయి 82 పరుగులు చేసింది. పదో ఓవర్ వేసేందుకు వచ్చిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో మహిపాల్ లోమ్రోర్(1) స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఆర్‌సీబీ 85 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు బెంగళూరు స్కోరు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ( 38 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు ) అర్థ శతకంతో చెలరేగిపోయాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, బ్రేస్ వేల్ 12 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు ) అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు.
