Gujarat Titans Scored 72 Runs In First 10 Overs: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. లక్ష్యాన్ని ఛేధించేందుకు చెమటోడుస్తోంది. సీఎస్కే బౌలింగ్ ఎటాక్‌కు.. అతికష్టం మీద పరుగులు చేస్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి.. రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులే చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. జీటీ మరో 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉంటుంది. అంటే.. ఇకపై మెరుపులు మెరిపించాల్సి ఉంటుంది. ప్రతీ ఓవర్‌కి 10 రన్ రేట్‌తో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అఫ్‌కోర్స్.. గుజరాత్ టీమ్‌లో మంచి బ్యాటర్లు ఉన్న మాట వాస్తవమే గానీ, సీఎస్కే లాంటి బౌలింగ్ ఎటాక్‌ని ఎదుర్కొని, అంత భారీ లక్ష్యాన్ని ఛేధించాలంటే, కత్తి మీద సాము వంటిది.
Telangana Decade Celebrations: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. 21 రోజుల పాటు ఉత్సవాలు..
ప్రారంభం నుంచి కేవలం శుబ్మన్ గిల్ ఒక్కడే ఆచితూచి ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ, క్లిష్టమైన బంతుల్ని సింగిల్స్ లేదా డబుల్స్‌గా మలిచేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆరంభం నుంచే జీటీ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. దూకుడుగా ఆడలేదు. ఇక దూకుడు పెంచాలనుకున్న టైంలో.. సాహా వికెట్ కోల్పోయింది. ఆ కొద్దిసేపటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన షనకతో కలిసి.. గిల్ తన జట్టుని ముందుకు నడిపించాడు. షనక కుదురుకోవడానికి కొంత సమయం తీసుకొని, ఆ తర్వాత ఒక ఫోర్ మరో సిక్స్‌తో ఆశలు చిగురించాడు. కానీ.. 11వ ఓవర్‌లో అతడు జడేజా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే.. జీటీ జట్టు ఇప్పుడు కష్టాల్లో ఉంది. మరి, ఎలా నెట్టుకువస్తుందో చూడాలి.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో మందుబాబుల వీరంగం.. వీడియో వైరల్..!