గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ఇమ్రాన్ ఖేదావాలా 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ముస్లిం అభ్యర్థి.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వచ్చి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది.