కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది… ఘాటు విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి.. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ.. ఇక, డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత…