(సెప్టెంబర్ 24తో ‘గుడ్డి’ సినిమాకు 50 ఏళ్ళు) స్టార్ హీరోయిన్ గా, మహానటిగా పేరొంది, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న జయాబచ్చన్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘గుడ్డి’. 1971 సెప్టెంబర్ 24న విడుదలయిన ‘గుడ్డి’ చిత్రంలో మేచో హీరో ధర్మేంద్ర వీరాభిమానిగా జయబాధురి నటించారు. ఇందులో ‘గుడ్డి’ టైటిల్ రోల్ లో జయబాధురి అలరించిన తీరు భలేగా ఆకట్టుకుంది. ఈ సినిమా నగరాలలో ఘనవిజయం సాధించింది. ఇతర చోట్ల ఏవరేజ్ గా, ఎబౌ ఏవరేజ్…