ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు అక్రమించుకొని పదిరోజులైంది. అధికార బదలాంపు ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ ను నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన పేరు ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీలకమైన రక్షణ, ఆర్ధిక శాఖలను తాలిబన్లకు నమ్మకమైన వ్యక్తులకు అప్పటించబోతున్నారని సమాచారం. గతంలో అమెరికాలోని గ్వాంటెనామో బే జైల్లో ఖైదీగా శిక్షను అనుభవించిన ముల్లా అబ్దుల్ ఖయ్యుం జకీర్‌కు అప్పగించబోతున్నారని సమాచారం. 2001లో అమెరికా దళాలు తాలిబన్లపై దాడి…