సాధారణంగా రోడ్లు వేసేటప్పుడు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించే సమయంలో చెట్లు అడ్డుగా ఉంటే ఏం చేస్తారు? దాన్ని నరికి పక్కన పారేస్తారు. ఇదే సులభమైన పని కదా.. కానీ.. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెట్టుకు ప్రాణప్రతిష్ట చేశారు. రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని వేళ్ళతో సహా పెకిలించి, మరోచోట నాటారు. భారీ క్రేన్ల సహాయంతో చెట్టును తరలించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ వినూత్న ప్రయత్నం సఫలీకృతం కావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో…
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ఎకో పార్క్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిధిలోని 400 ఎకరాలు మాత్రమే కాకుండా, మొత్తం 1600 ఎకరాలను కూడా కలిపి 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ఈ ఎకో పార్క్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై…
ఒక్క వాహనం కాదు, వందల వాహనాల చప్పుళ్లు మార్పు శంఖారావాలా మారుతున్న ఈ ప్రయాణం పేరు – "యూనిటీ డ్రైవ్ – యునైటింగ్ ది నేషన్స్ ఆన్ వీల్స్". వన్ సీ (Onesea) మీడియా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం, హైదరాబాద్ నుంచి స్పితి వ్యాలీ దాకా కొనసాగనుంది. మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి విలువలపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడమే లక్ష్యం.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7 శాతం పెరిగిందని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్…