Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా దాని ప్రభావం కూడా మెల్లగా కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో గ్రూప్ 70 శాతం లాభాన్ని సాధించింది. పోర్ట్, పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ఈ మూడు నెలల్లో చాలా మంచి పనితీరు కనిపించింది.
PM Narendra Modi: పునరుత్పాదక ఇంధనం బంగారం గనుల కన్నా తక్కువేం కాదని.. ఇందులో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ గ్రోత్‌పై యూనియన్ బడ్జెట్ 2023-24లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..గ్రీన్ ఎనర్జీలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని వాటాదారులను ఆహ్వానిస్తున్నానని అన్నారు. భారతదేశం సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుందని, నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రైవేట్ రంగానికి రూ.19,000 కోట్ల…
Telangana Best in India: ఈఎస్‌జీ.. అంటే.. ఎన్విరాన్‌మెంటల్(పర్యావరణ), సోషల్(సామాజిక) మరియు గవర్నెన్స్(పాలన)పై హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) శ్రద్ధ చూపటం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్‌జీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు హైసియాని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. మనమంతా ఈఎస్‌జీపై సరైన సమయంలోనే దృష్టిపెడుతున్నామని అన్నారు.
ఏపీలో పరిశ్రమలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచాలని సీఎం జగన్ అన్నారు. అమరావతిలో పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్.జగన్ సమీక్ష చేపట్టారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎంఎస్‌ఎంఈల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో కాలుష్య నివారణపై జగన్ మాట్లాడారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన…