మంత్రి లక్ష్యంగా ఆ జిల్లాలో బీజేపీ పావులు కదుపుతోందా? సీబీఐ గట్టిగానే ఉచ్చు బిగిస్తోందా? వందల కోట్ల స్కామ్ కావడంతో అంతా ఉలిక్కి పడుతున్నారా? మంత్రి విషయంలో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొందా? గ్రానైట్ కేసులో మంత్రి గంగుల ఇరుక్కున్నట్టేనా?ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 350కిపైగా గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో అత్యధికం రాజకీయ నేతలవే. వారిలో ఒకరు మంత్రి గంగుల కమలాకర్. ఆయన ఆధ్వర్యంలోనూ కొన్ని గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. 2012లో జరిగిన స్కామ్‌పై…