ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఉన్న గ్రామ పంచాయితీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు.. కొన్ని ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం జరిగింది.. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లోనే గ్రామ సచివాలయాలను నిర్వహిస్తున్నారు. అయితే, అద్దె చెల్లించని కారణంగా సచివాలయ కార్యాలయానికి తాళం వేశాడు.. ఆ ఇంటి యజమాని.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర అధ్యక్షులు జానీ పాషా తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం నాడు కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. జూన్ 30లోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. విజయవాడలో సీఎం జగన్‌కు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని జానీ పాషా పేర్కొన్నారు. కాగా ప్రొబేషన్ ఖరారు చేసేందుకు అర్హులైన ఉద్యోగుల…
ఏపీలో సీపీఐ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి తరచూ లేఖలు రాస్తుంటారు సీపీఐ నేత రామకృష్ణ. తాజాగా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదన్నారు. వారికి కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామ సచివాలయ…
గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ జూన్ 30వ తేదీ నాటికి ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి కాబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రొబేషన్‌పై విముఖతతో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించారు. ప్రొబేషన్ డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా కార్యాచరణ ప్రకటన చేశారు. పే స్కేల్ కూడా కల్పించాలని గ్రామసచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులంతా ట్విట్టర్ ద్వారా డిమాండ్ తెలపాలని సూచించారు. రేపు నల్ల రిబ్బన్లతో విధులకు…