దశాబ్దాల నిరీక్షణకు తెర పడింది. మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించనుంది రాష్ట్ర సర్కార్. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. కాగా.. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం జరిగింది.