మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.