కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2021, మార్చి 1 నాటికి అన్ని శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య మొత్తం 40.35లక్షలు కాగా.. వాటిలో దాదాపు పది లక్షలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే…
నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) శుభవార్త చెప్పింది. ఈ మేరకు 64 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్, సీనియర్ సైంటిఫిక్ అధికారి, మెడికల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్‌సీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కొరకు నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్‌సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాల కోసం upsconline.nic.in వైబ్…
తెలంగాణ కేబినెట్ ఇవాళ మళ్లీ భేటీకానుంది. నిన్న జరిగిన భేటీలో కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా, జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై ఇవాళ చర్చించనుంది కేబినెట్. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులను ఆదేశించిన కేబినెట్.. ఖాళీల భర్తీకి వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని నిర్ణయించింది. గురుకులాల్లో స్థానిక నియోజకవర్గ విద్యార్థులకే 50శాతం సీట్లు కేటాయించ నున్నారు. read also : ఇవాళ అమిత్‌షాతో బండి…
50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. 13న జరిగే కేబినెట్ లో ఉద్యోగాల ఖాళీ, భర్తీ పై చర్చ జరగనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం అయిన ఆర్థిక శాఖ… గతంలో ఇచ్చిన ఖాళీ వివరాల పై సమీక్ష జరపనుంది. శాఖల వారిగా ఖాళీల ఫైనల్ జాబితా తీసుకున్న ఫైనాన్స్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 2021-22 కు సంబందించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామనే సమగ్రసమాచారాన్ని పొందుపరచింది. ఈ జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు సంబందించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది. Read: ‘అఖండ’ ప్రత్యేక గీతంలో రత్తాలు! పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోటీ పరీక్షలు…