Arif Mohammed Khan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా పరిస్థితి మారింది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కాలికట్ యూనివర్సిటీకి గవర్నర్ వెళ్లిన సమయంలో అధికార సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడం మరోసారి వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై గవర్నర్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ టార్గెట్‌గా నేరుగా విమర్శలకు దిగారు.