సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్ లో మెడికల్ ఎక్విప్ మెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జిల్లా కలెక్టర్,ఎస్పీ పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్ లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ను ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఐఐటి హైదరాబాద్ లో తయారు చేసిన జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసియు వెంటిలేటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది.…
వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ కి గురికావద్దని వైద్యవిద్యార్ధులకు సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బీబీనగర్ ఎయిమ్స్ లో 2021 – 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమోనీ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైద్యవిద్యార్ధులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు గవర్నర్. ఆయుష్‌మాన్ భారత్, జన ఔషధి పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నం అన్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంపై ఆయన మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంట కలిపేలా ఉంది. మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా? రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే…
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. వనదేవతలను దర్శించుకున్న ఆమె.. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.. తెలంగాణ ప్రజలంతా…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు గవర్నర్.. ఆ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 2వ అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారభించనున్నారు.. ఇక, అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆమె.. మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహ…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో మాట్లాడారు. ఆ సమయంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కలవడం లేదు అని విమర్శలు గతంలో ఉన్న సమయంలో నేను ప్రజలను కలుస్తాను. అవసరమైతే రాజ్ భవన్ లో ఒక సెల్ కూడా పెడతాను అని గవర్నర్ గా మీరు చెప్పారు. అది ఎందుకు ఇంకా ప్రారంభం కాలేదు అని అనే ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం ఇస్తూ… నేను ప్రజా దర్భార్ ప్రారంభించాలి అనుకున్నాను. ఆ…
ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన వుదయం తెలిసిందే. అయితే ఈ పెట్రోల్ పెట్రోల్ సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ కేంద్ర ప్రజల పై భారం మోపుతోంది అని అంటుంది. కానీ కేంద్రం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించుకుంటే సరిపోతుంది అని అంటుంది. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో ఈ విషయం పై మాట్లాడుతూ… నిన్ను ఇక్కడ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో మాట్లాడారు. ఆ సమయంలో.. గతంలో నరసింహన్ గవర్నర్ గా సమయంలో రాజ్ భవన్ కు.. సీఎం ఆఫీస్ కు మధ్య మంచి సంభందాలు ఉండేవి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత రెండింటి మధ్య గ్యాప్ పెరిగిందా..? అనే ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం ఇస్తూ… దానిని దూరం అని నేను చెప్పను. అలాగే దగ్గరగా ఉన్నం అని కూడా చెప్పను. అయితే నరసింహన్ గారు ఇక్కడ…
తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ విలీనమా..? విమోచనమా? అనే చర్చ సాగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుంటే.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం విమోచన దినంగా పాటిస్తోంది.. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన గవర్నర్ తమిళిసై.. “సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు…
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి వీలుగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్‌రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) కోవిడ్ జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌పై ఏర్పాటుచేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహనాలను శనివారం ఆమె రాజభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రజలలో కోవిడ్ టీకాపై ఉన్న సంశయం క్రమంగా తొలగిపోయి ప్రస్తుతం భారత్ 42…