Telangana Governor Tamilisai Said I am happy to speak Telugu: తెలంగాణ భాష ‘క్లాసిక్ భాష’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని గవర్నర్ పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని గవర్నర్ తమిళిసై చెప్పారు. రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు.
‘స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ. సమాజానికి కొత్తదానాన్ని అందించడం మన బాధ్యత. మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ భాష క్లాసిక్ భాష. మాట్లాడుతున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఈ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు ఎన్ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలి. తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందం, ఇది కన్నుల పండగగా ఉంది’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు.
Also Read: Telangana Temperature: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మార్చిలో మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు!
‘మాతృభాష మన జీవితంలో అవసరం. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలి. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి.. సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలి. నా మాతృభాష తమిళ్. నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు, శ్రమనే ఆధారం’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పుకొచ్చారు.