ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.