విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం రచ్చగా మారింది. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, మహిళలకు రక్షణలో ప్రభుత్వ వైఫల్యాలను లేఖలో పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు..…