ప్రభుత్వ పాఠశాలలో కుమారుడి పెళ్లి జరిపించిన టీచర్‌కి హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా మందలించింది. ప్రభుత్వ పాఠశాలలో పెళ్లి ఎలా జరిపిస్తారంటూ న్యాయస్థానం నిలదీసింది. విచారణ సందర్భంగా టీచర్ క్షమాపణ చెప్పారు. నాలుగు వారాల్లోగా పాఠశాల క్యాంపస్‌లో రెండు వాటర్ ప్యూరిఫైయర్‌లను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
బీహార్‌లోని వైశాలిలో విద్యార్థినుల ఉగ్రరూపం కనిపించింది. మహ్నార్ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతిలో కూర్చోవడానికి స్థలం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అంతేకాకుండా.. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) వాహనంపై విద్యార్థినులు రాళ్లు రువ్వారు.