ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తాం.. వచ్చే విద్య సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్లు కూడా అంతజేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమల్లోకి తెస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో ప్రపంచంలో అనేక దేశాల్లో తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారి.. ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం క్లీన్ ఎనర్జీదే ప్రముఖ పాత్ర అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనల ద్వారా విద్యార్థులు కొత్త వాటిని కనుగొనాలని మంత్రి చెప్పుకొచ్చారు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో…
రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ బిగించటం లేదని చాలాసార్లు చెప్పామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారని, ఇందులో నిజం లేదన్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబును చూసి…
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై జగన్ ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే అని, సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారని…
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు..
భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు.