సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం ముందు రోజున ఇలా పద్మ అవార్డులు ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే కొద్ది సేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి 2006వ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు గాను అదేవిధంగా…