సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం ముందు రోజున ఇలా పద్మ అవార్డులు ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే కొద్ది సేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి 2006వ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు గాను అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమగా ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించి, అందించారు.
ఇక కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసి సినీ కార్మికులను, జర్నలిస్టులను, అనేకమంది సాధారణ ప్రజలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఆక్సిజన్ బ్యాంకు సైతం ఏర్పాటు చేసి దానితో సేవలు అందించడం మాత్రమే కాకుండా తన అభిమానులు కరోనా సేవల్లో భాగం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. ఇక ఈ అవార్డు ప్రకటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన మాట్లాడిన పూర్తి వీడియో కింద ఉంది చూసేయండి.
🙏🙏🙏 pic.twitter.com/QAfqE5Rk1G
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2024