శివరాత్రి 2025ను పురస్కరించుకుని ప్రత్యేక పాటను ఆవిష్కరించింది వనిత టీవీ.. "దేవ దేవ శంకర దేవ శంభో శంకరా.. దేవులాడినేడదొరకవా..! ఆది ఆది శంకరా యాడతిరుగుతున్నవు.. జాడతెల్వకున్నవేందిరా..!! నిప్పుగాని నిప్పువు.. నీడగాని నీడవు.. మూఠలేని ముల్లెవు ఏ మిచ్చినా ఒల్లవు..!!! అన్ని ఉండి ఏమీ లేని అదిభిక్షువున్నవు..!!! అంటూ ప్రముఖ రచయిత, సింగర్ గోరేటి వెంకన్న రాయడంతో పాటు తన గొంతు సవరించారు..
తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
శాసన మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని అన్నారు. కేసీఆర్ జనాల గుండెల్లో నిలిచి పోయారని తెలిపారు. వందల ఎకరాలు ఉన్న వాళ్లకు హీరోలకు, హీరోయిన్లకు, ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు రైతు బంధు వద్దని అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెపుతున్నా అని గోరేటి వెంకన్న పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంను అధికారులు బ్లేమ్ చేశారు.. 317 జీవోను తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంను బదానం…
ప్రజాకవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది… ప్రజాకవిగా తన స్వరం విప్పిన గోరటి వెంకన్న పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. తెలంగాణ యాశలో.. అడవి, పల్లెలు, అనగారిన వర్గాల బాధలే కాదు.. ప్రేయసిపై పాట రాసికూడా అందరినీ ఆకట్టుకున్నారు.. ఇప్పుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.. 2021 ఏడాదికి తెలుగు సాహిత్యంలో వల్లంకి తాళం కవితా సంపుటికి గోరటి వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక…