అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని…