ఈ యేడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన ఘనత నిస్సందేహంగా యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కే దక్కుతుంది. జనవరి 12న విడుదలైన ‘వీరసింహారెడ్డి’తో ఆ ఫీట్ సాధించారు గోపీచంద్. ఈ సంవత్సరం మొదటి రోజున రూ.54 కోట్ల గ్రాస్ ను చూసిన సినిమాగా ‘వీరసింహారెడ్డి’ రికార్డ్ సృష్టించింది. తన అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం హీరో కెరీర్ లో ‘టాప్ గ్రాసర్’గా నిలవడం విశేషం! మాస్ ను…