జనగామ జిల్లాలోని బచ్చన్న పేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గుడిసెలు వెలిశాయి. బచ్చన్నపేట మండల కేంద్రంలోని గోపాల్ నగర్ సర్వే నెంబర్ 174 లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ గుడిసెలు వెలవడంతో.. వాటిని తొలగించడానికి భారీగా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు.