ఆన్లైన్ షాపింగ్‌ను సులభతరం చేయడానికి, అలాగే మరింత పారదర్శకంగా చేయడానికి గూగుల్ పే మూడు కొత్త ఫీచర్‌లను అందిస్తోంది. గూగుల్ పే ప్రకటన పోస్ట్ ప్రకారం., అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్యాపిటల్ వన్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు ఆటోఫిల్ డ్రాప్-డౌన్” మెనులో క్రోమ్ డెస్క్ టాప్ లో చెక్ అవుట్ చేసినప్పుడు వారు పొందగల ప్రయోజనాలను చూస్తారని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్లలలో భాగంగా చెల్లింపు చేయడానికి ముందు కార్డ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోని ఉండాలి. ఆ…
ప్రస్తుతం నగదు దగ్గర ఉంచుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. ప్రతిదీ ఆన్లైన్ మయంగా మారింది. డిజిటల్ చెల్లింపు విధానం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. చిరువ్యాపారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు అందరూ వాటిపైనే ఆధారపడుతున్నారు.
నాన్-పేమెంట్ సేవల కోసం భారతదేశంలో గూగుల్ వాలెట్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌లో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్‌లు, పాస్‌లు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.
ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. ఎవరైనా వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదును గుర్తించి…
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ చర్య తీసుకుని దాదాపు నెల రోజులు కావస్తోంది. రోజురోజుకూ కంపెనీ కష్టాలు తగ్గకుండా పెరుగుతున్నాయి. కంపెనీకి ఉపశమనం ఇస్తూ ఆర్బీఐ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.
Nirmala Sitharaman : స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ కంపెనీలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.
Supriya Sule: ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లు పేలబోయే టైమ్ బాంబులు ‘‘టిక్కింగ్ టైమ్ బాంబ్స్’’గా శుక్రవారం ఆరోపించారు. మనీలాండరింగ్ తనిఖీలు చేయడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రం’’పై జరిగిన చర్చ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Paytm : Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI చర్య తర్వాత Paytm కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఈ చర్య అనేక ఇతర కంపెనీలను లాభాల పట్టేలా చేసింది. Paytm ఇబ్బందుల నుండి వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు.
UPI Outage: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విఫలమవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలువురు నెటిజన్లు ఎక్స్(ట్విట్టర్)వేదికగా అంతరాయం గురించి ట్వీట్స్ చేశారు. తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తో పాటు బ్యాంకింగ్ రంగం దేశవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో ఈ రోజు సాయంత్రం డిజిటల్ చెల్లింపుల్లో అవాంతరాలు ఎదురయ్యాయి.
Phonepe Sold Maximum Insurance Policies: డిజిటల్ చెల్లింపులకు పేరుగాంచిన ఫోన్‌పే కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 2021లో బీమా బ్రోకింగ్ లైసెన్స్ పొందినప్పటి నుంచి దాదాపు 9 మిలియన్ల పాలసీలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో గత ఏడాది మాత్రమే దాదాపు 4 మిలియన్ల పాలసీలు అమ్ముడయ్యాయి. PhonePe 2020 సంవత్సరంలో బీమా రంగంలోకి ప్రవేశించింది. కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ పొందిన తర్వాత కంపెనీ ఈ స్పేస్ లోకి వచ్చింది. ఒకరకంగా పూర్తి బీమా…