వరల్డ్ కప్ 2023 ప్రారంభంకు ముందే టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో జట్టు ఆడిన రెండు మ్యాచ్లకు అతను దూరమ్యాడు. అయితే అప్పటి నుంచి చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందగా.. తాజాగా కోలుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం గిల్ నెట్స్ లో అడుగుపెట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్' (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగం పైన ఆసక్తి ఉంటుంది. కొందరు డాక్టర్ అవ్వాలనుకుంటే మరికొందరు యాక్టర్ అవ్వాలనుకుంటారు. కొందరికి బెస్ట్ డాన్సర్ అనిపించుకోవడం ఇష్టం, కొందరికి బెస్ట్ ఇంజినీర్ అనిపించుకోవడం ఇష్టం. అలానే కొందరికి ప్రంపంచం లోనే అందగత్తెగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశ. ఆ కాంక్షని నెరవేర్చుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తుంటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన కొందరు మాత్రం వాళ్ళ కలని సాకారం చేసుకోలేపోతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి…
ఇప్పటికే శ్రీలంకలో వర్షాలు భారీగా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు వర్షం కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటినుంచి జరగబోయే మ్యాచ్ లకు వర్ష ప్రభావం ఏమీ ఉండదని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
మహిళా ప్రయాణికులకు తెలంగాణ స్టేట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీ.ఎస్.ఆర్టీసి ఏర్పాటు చేసింది. 127K నంబర్ బస్సు మహిళల కోసం ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. లేడీస్ స్పెషల్ బస్సు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.
ఏపీ ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ సీఎం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్సుకోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఇవాళ (సోమవారం) ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం సీఎం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.