Marriages Season: తెలుగు రాష్ట్రాలలో పెళ్లి సందడి ప్రారంభమైంది. మూఢాల కారణంగా మూడు నెలలుగా శుభకార్యాలకు చెక్ పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 21 వరకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో 20 రోజుల పాటు పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే లక్ష పెళ్లిళ్లు జరగనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం కలుపుకుంటే దాదాపు 5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు సమాచారం అందుతోంది. అందులోనూ విదేశీ ప్రయాణాలపై కరోనా ఆంక్షలు తొలగడం,…