ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.