Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు…