ప్రతి ఆభరణానికి హాల్మార్క్తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాణ్యతతో నిమిత్తం లేకుండా ప్రతి జ్యువెల్లరీ వ్యాపారి జూన్ ఒకటో తేదీ నుంచి హాల్మార్క్డ్ బంగారం ఆభరణాలు విక్రయించాల్సి ఉంటుంది. క్యారట్లతో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభరణాలు తప్పనిసరిగా హాల్మార్క్డ్ చేసి విక్రయించాల్సిందే. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) గత నెల నాలుగో తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 14 క్యారట్లు, 18 క్యారట్లు, 20…
అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు , సీ పోర్టులు వేదికలు అవతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయాల్లో డ్రగ్స్, బంగారం పట్టుబడుతున్నాయి. విదేశాల నుంచి దేశానికి అక్రమంగా వీటిని రవాణా చేస్తున్న సమయంలో అధికారులు పట్టుకుంటున్నారు. దీనికి తోడు సముద్రమార్గాల ద్వారా అక్రమార్కులు డ్రగ్స్ ను దేశంలోకి తీసుకువస్తున్నారు. తాజా దేశంలో బంగారం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడగా… తమిళనాడు కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీ…
బంగారం మెరిసింది. వెండి వెలవెలబోయింది. మంగళవారం మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్లలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఇదే ట్రెండ్ నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం, వెండి రెండు ధరలూ తగ్గి అక్కడి కొనుగోలుదారులకు శుభవార్తగా నిలిచాయి. పెరుగుతోన్న బాండ్ ఈల్డ్స్.. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిళ్లకు దారితీస్తుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా నమోదవుతోన్న ధరల ప్రభావం కూడా దేశీయంగా…
యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. పగలు, రాత్రులు అని తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ రూ.లక్షల విలువ చేసే సొత్తును దోసుకెళుతున్నారు. ఎండాకాలం ఆరుబయట నిద్రిస్తున్న వారే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగేం గ్రామంలో ఎండాకాలం రాత్రి పుట ఆరుబయట నిద్రిస్తున్న అండాలు అనే మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారం గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు.…
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒకవైపు మదర్స్ డే వేడుకలకు ప్రపంచం సిద్ధం అవుతోంది. అయితే హైదరాబాద్ లో ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య,భూదేవి (58)అలియాస్ లక్ష్మి దంపతులు దిల్ సుక్ నగర్ న్యూ గడ్డి అన్నారం కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు. అతని వయసు 27 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి జంగయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్…
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో ట్విస్ట్ బయటపడింది. నగలకోసం మహిళ హత్య జరిగిందని తెలుస్తోంది. భక్తురాలిని హత్య చేసిన పూజారి అని తేలడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మల్కాజిగిరి పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పూజారి మురళిని పట్టుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు. మల్కాజిగిరి ఉమాదేవి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈనెల 18న వినాయక టెంపుల్ కి వెళ్ళిన…
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. సామాన్యులకు అందనంత ఎత్తుకు ధరలు ఎగబాకుతున్నాయి.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. కమోటిటీ ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 54 వేల మార్క్ ను తాకింది. ఇంట్రాడేలో 54,190 రూపాయలకు వెళ్లింది. 24 క్యారెట్ల తులం బంగారం.. ఆల్ టైమ్ గరిష్టానికి 2వేల దూరంలో నిలిచిపోయింది. 2020 ఆగస్టులో 56,191 రూపాయలను తాకింది. ఇప్పటివరకు ఇదే జీవితకాల…
పసిడి ప్రేమికులకు షాకిస్తూ.. రూ.51 వేలకు పైగా చేరిన 10 గ్రాముల బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ కిందకు దిగింది.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.50 వేల దిగువకు పడిప్ఓయింది.. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు.. దేశీయంగా డిమాండ్ కాస్త తగ్గడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర కిందకు దిగివచ్చిందంటున్నారు.. దాదాపు ఒక ఏడాది తర్వాత ఢిల్లీ మార్కెట్లో గరిష్ట స్థాయి ధరను రూ.50,350కు…
అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. షూస్, జీన్ ప్యాంట్ లు, ట్యాబ్లెట్లు, ఫైల్ ఫోలర్లు వేటీనీ వదిలిపెట్టడం లేదు. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో ఓ మహిళ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది. విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీల్లో 23 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఓ మహిళ తల విగ్గులో బంగారం దాచి గుట్టుగా బయటపడదామని ప్లాన్ చేసింది. అయితే కస్టమ్స్ అధికారుల ముందు ఆమె ఆటలు సాగలేదు.…