Gold Coin: కిచెన్ బాగు చేస్తుంటే.. బయటపడ్డ బంగారు నాణేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Coin: ఏదైనా నిధి దొరికితే బాగుండు నాకున్న అన్ని కష్టాలన్నీ తొలగి పోతాయి అని అనుకునే వారు మనలో చాలామందే ఉంటారు. కానీ ఓ కుటుంబం మాత్రం అలా అనుకోకుండానే వారికి నిధి దొరికింది. కానీ దానికోసం వారు ఎక్కడెక్కడో తవ్వకాలు జరపలేదండోయ్.. వారి పాత ఇంట్లో వంట గది పాడయిందని రినోవేషన్ చేయిస్తుంటే కలపతో చేసిన ఫ్లోరింగ్ కింద చిన్న పాటి డబ్బా బయట పడింది. ఏంటని తీసిచూస్తే అందులో తళుక్కుమంటున్న బంగారు నాణేలు బయటపడ్డాయి. యునైటెడ్ కింగ్ డమ్ లోని నార్త్ యార్క్ షైర్ పరిధిలోని ఎల్లెర్ బీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Jio 5G: రాకెట్ స్పీడుతో జియో 5జీ.. దగ్గరలో లేని ప్రత్యర్థి కంపెనీలు
Also Read
- Kalma Homework: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
- 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
చెక్క ఫ్లోరింగ్ కింద దొరికిన డబ్బాలో మొత్తం 254 నాణేలను గుర్తించారు. వాటిని పరిశీలించగా.. 1720వ సంవత్సరంలో బ్రిటన్ పాలకులు జారీ చేసిన 50 పౌండ్లు, 100 పౌండ్ల బంగారు నాణాలుగా గుర్తించారు. మూడు వందల ఏళ్ల కిందటివి అందులో నాడు చలామణీలో ఉన్న బ్రెజిల్ బంగారు నాణెం కూడా ఉంది. మొత్తంగా ఈ నాణాలను లండన్ కు చెందిన స్పింక్ సంస్థ వేలం వేయనుంది. వేలం కోసం ఒక్కో బంగారు నాణానికి కనీస మొత్తంగా రూ.40వేల నుంచి రూ.లక్ష రూపాయల దాకా ధర నిర్ణయించారు. మొత్తం 254 నాణాలను వేలం వేయనున్నారు. అన్ని నాణాలకు కలిపి కనీస మొత్తంగా మూడు లక్షల డాలర్లు (సుమారు రెండున్నర కోట్లు) ధర నిర్ణయించారు. పాత నాణాలు కాబట్టి.. వేలంలో పాల్గొనే వారిని బట్టి వీటికి ధర పెరిగే అవకాశం ఉంటుందని వేలం సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్ కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రేగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్ లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!