Gold Price: పసిడి ప్రేమికులకు శుభవార్త.. గోల్డ్ రేట్ తగ్గింది.. త్వరపడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price: కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు తగ్గడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వస్తుండడంతో బంగారానికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి కావున కొనాలంటే ఇదే మంచి సమయం అంటున్నారు విశ్లేషకులు. ఎంసీఎక్స్‌లో బంగారం 1.3 శాతం పడిపోయి తులం రూ.700 మేర తగ్గింది. ఒక్కరోజులో ఇంత తగ్గడం గత మూడు నెలల్లో ఇదే తొలిసారి.
అమెరికా ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను భారీగా పెంచనుందని వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. వచ్చే నెలలో సమావేశం కానున్న ఫెడ్ ఈసారి ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది డాలర్‌ను బలపరిచింది. వడ్డీ రేట్ల పెంపు చేపడితే అది బంగారం డిమాండ్‌ను తగ్గిస్తుంది. అందుకే మళ్లీ గోల్డ్ రేట్లు పడిపోయాయి.
Read Also: Election Agenda: ఇంటికో బైక్, రోజుకో ఫుల్ బాటిల్, రూ.20కే లీ.పెట్రోల్.. నాకే ఓటెయ్యండి?
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1672 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ కూడా 19.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.45 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.250 మేర తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం హైదరాబాద్‌లో రూ.47,600కు చేరింది. ఇదే 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.52,200 నుంచి రూ.51,930కు పడిపోయింది. అంటే తులం బంగారం రూ.270 మేర తగ్గిందన్నమాట. సిల్వర్ రేటు ఇంకా భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఒక్కరోజులోనే రూ.1200 తగ్గింది. అక్టోబర్ 10 ఉదయం కేజీ సిల్వర్ రూ.66 వేల వద్ద ఉండగా.. ప్రస్తుతం అది రూ.64,800కు చేరింది.
ఆయా ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 250 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.47,750కి పడిపోయింది. 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.260 తగ్గి రూ.52,100కు పతనమైంది. దిల్లీలో సిల్వర్ రేటు కేజీకి రూ.1300 తగ్గింది. ప్రస్తుతం అక్కడ రూ.59,500 పలుకుతోంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!