Gold Supplying Banks: గోల్డ్ సప్లై బ్యాంక్‌లు ఇండియాకి షిప్‌మెంట్లను తగ్గించాయి. మన దేశానికి బదులుగా చైనా, టర్కీ మరియు ఇతర మార్కెట్లకు బంగరాన్ని తరలించాయి. ఇండియాలో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన కన్నా ఆయా దేశాల్లోనే బెటర్ ప్రీమియమ్ ఆఫర్లు ఉండటంతో అటు వైపు ఫోకస్ పెట్టాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ అయిన ఇండియాలో బంగారం కొరత నెలకొననుంది.