అధికారం చేతులో ఉంది కదా.. ఆటలాడుకున్నారు ఆ పోలీసులు. కంచే చేను మేసింది అనే విధంగా నడుచుకున్నారు. ఇల్లీగల్ మనీ ఉంటే దాన్ని నిర్ధారించి కేసు బుక్ చేయాల్సింది పోయి.. విడిచి పెట్టేందుకు లంచం తీసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో సస్పెండ్ అయ్యారు. కట్టల కొద్దీ డబ్బు చూసి ఆశ పెరిగింది..కట్టల కొద్దీ డబ్బులు చూసి వారిలో ఆశ పెరిగింది.. కోట్లు కళ్ల ముందు ఉండడంతో రూల్స్ పక్కకు పెట్టేశారు.కోట్ల రూపాయలు కళ్ల ముందు…
IT Raids : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో భారీగా ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు, చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ దాడులలో ఇప్పటి వరకు 40 కేజీల బంగారం.. 100 కేజీల వెండి.. 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా,…
సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారంతో పట్టుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం తెలిపింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గ్రీన్ ఛానల్‌ను దాటడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. అతని మోకాలి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు.