చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు…