ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ స్టార్ గా మాత్రం కొనసాగలేకపోయింది. ఇక…