:అందోల్ మండల పరిధిలోని జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తుండగా పట్టించాడని శేఖర్ అనే బాలుడిని నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు తానే హత్య చేసినట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సెల్ టవర్ ఎక్కి కేబుల్ వైర్లతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.