ఇంగ్లీష్ తో పాటు మూడు భారతీయ భాషలు హిందీ, తెలుగు, తమిళంలో ఆగస్ట్ 14న అమెజాన్ ప్రైమ్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి సమీక్షలు అందుకున్న ఈ సినిమాను ఆడమ్ వింగార్డ్ తెరకెక్కించారు. మిల్లీ బాబి బ్రౌన్, అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్, రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, జూలియన్ డెన్సిసన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘కాంగ్: స్కల్ ఐలాండ్ (2017), గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది…
మాన్ స్టర్ చిత్రాల్లో నాలుగోదైన ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ కరోనా అనంతరం విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన ‘టెనెట్’ చిత్రం 365 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 390 మిలియన్ డాలర్లతో గ్లోబల్ బాక్సాఫీస్ లో ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ రికార్డ్ సృష్టించింది. ‘టెనెట్’ మొత్తం రన్ ను ఈ సినిమా రెండువారాల క్రితమే క్రాస్ చేసేసింది. న్యూయార్స్, లాస్ ఏంజెల్స్ లో థియేటర్లు రీ-ఓపెన్ చేసిన…