‘టెనెట్’ ను క్రాస్ చేసిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాన్ స్టర్ చిత్రాల్లో నాలుగోదైన ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ కరోనా అనంతరం విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన ‘టెనెట్’ చిత్రం 365 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 390 మిలియన్ డాలర్లతో గ్లోబల్ బాక్సాఫీస్ లో ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ రికార్డ్ సృష్టించింది. ‘టెనెట్’ మొత్తం రన్ ను ఈ సినిమా రెండువారాల క్రితమే క్రాస్ చేసేసింది. న్యూయార్స్, లాస్ ఏంజెల్స్ లో థియేటర్లు రీ-ఓపెన్ చేసిన తర్వాత విడుదలైన తొలి చిత్రం ఇదే కావడం దీనికి కలిసి వచ్చింది. ఈ సీరిస్ లో వచ్చిన గత మూడు చిత్రాలకంటే చైనాలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అత్యధికంగా 177 మిలియన్ డాలర్లను వసూలు చేయడం విశేషం. ఈ చిత్రం ఆస్ట్రేలియాలో 19.1 మిలియన్ డాలర్లు, మెక్సికోలో 17.3 మిలియన్ డాలర్లు, తైవాన్ లో 12.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విదేశీ వసూళ్ళలో ఒక్క ఐమాక్స్ 28.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి, 9 శాతం కలెక్షన్లు సాధించింది. అయితే… యూరప్ లోని పలు దేశాలు ఇంకా కొవిడ్ తో పోరాటం చేస్తుండటంతో అక్కడ లాక్ డౌన్ కొనసాగుతోంది. అలానే నార్త్ అమెరికాలోని 56 శాతం థియేటర్లను తిరిగి ప్రారంభించలేదు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ చక్కని వసూళ్ళు చేసినట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Anil Ravipudi-NTR: ఎన్టీఆర్‌తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
- Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
- Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
- Vrushakarma: 'వృషకర్మ' రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ.. ట్రైలర్ ఎప్పుడంటే?
- Tags
- Godzilla vs Kong
తాజావార్తలు
-
Anil Ravipudi-NTR: ఎన్టీఆర్‌తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
-
Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
-
MG Windsor EV Facelift 2027: 449KM రేంజ్.. MG Windsor EVలో భారీ 61kWh బ్యాటరీ! ఎప్పుడు లాంచ్ కానుందంటే?
ట్రెండింగ్
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!