Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ ప్రభుత్వంతో పాటు పలువురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. తదుపరి విచారణ తేదీకి ఎలాంటి వాయిదాలు వేయబోమని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, రాజేష్ జిందాల్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.