Bhadrachalam Godavari: భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరికి మరోసారి వరద పోటెత్తింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.